Government Jobs Alert  DSSSB 216 Posts | Apply Now

DSSSB Jobs 2026

హాయ్ ఫ్రెండ్స్! మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా?

మీరంతా బాగుండాలని మనస్పూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మరో మంచి జాబ్ అప్‌డేట్‌తో మీ ముందుకు వచ్చాను. ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్లకి ఇది మంచి అవకాశం ఉంది. కాబట్టి వీడియోను పూర్తిగా వినండి, మీకు ఉపయోగపడుతుంది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) విడుదల చేసిన కొత్త నోటిఫికేషన్ గురించి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 216 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. వివిధ శాఖల్లో ఈ పోస్టులు ఉన్నాయి కాబట్టి వేర్వేరు అర్హతలు ఉన్నవాళ్లు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ఈ నోటిఫికేషన్‌లో ఉన్న ముఖ్యమైన పోస్టులు – అసిస్టెంట్ మేనేజర్ (టూరిజం), అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్), అసిస్టెంట్ మేనేజర్ (లీగల్), అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ), అసిస్టెంట్ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్స్), రేడియోగ్రాఫర్, ఆప్టోమెట్రిస్ట్, రిపోర్టర్, పట్వారీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 వంటి పలు రకాల పోస్టులు ఉన్నాయి. కాబట్టి మీ అర్హతకి సరిపోయే పోస్టు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు.

విద్యార్హతల విషయానికి వస్తే – పోస్టును బట్టి వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు అసిస్టెంట్ మేనేజర్ టూరిజం పోస్టుకు అప్లై చేయాలంటే టూరిజంలో మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ అకౌంట్స్ పోస్టుకు సీఏ లేదా సీఎంఏ పూర్తి చేసి కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ లీగల్ పోస్టుకు ఎల్‌ఎల్‌బి పూర్తి చేసి 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

రేడియోగ్రాఫర్ పోస్టుకు సైన్స్ గ్రూపుతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి రేడియోగ్రఫీలో డిప్లొమా లేదా బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. పట్వారీ పోస్టుకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది.

Railway Jobs for 10th/ITI/Diploma/Degree

వయోపరిమితి విషయానికి వస్తే – సాధారణంగా 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పివిబిడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది.

జీతం విషయానికి వస్తే – ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.18,000 నుండి రూ.1,51,100 వరకు జీతం లభిస్తుంది. కాబట్టి ఇది మంచి ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పొచ్చు.

దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే – జనరల్ అభ్యర్థులకు రూ.100 ఉంటుంది. అయితే మహిళలు, ఎస్‌సి, ఎస్‌టి, పివిబిడి, మాజీ సైనిక ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు నుండి పూర్తిగా మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. ముందుగా టియర్-1 పరీక్ష, తరువాత టియర్-2 పరీక్ష నిర్వహిస్తారు. అవసరాన్ని బట్టి కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ లేదా ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా నిర్వహించవచ్చు. పరీక్షలో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అంటే ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.

అప్లై చేయాలనుకునే అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. అప్లై చేయడానికి అధికారిక వెబ్‌సైట్ –

Job Alert: DSSSB 216 పోస్టులు | Salary ₹1.5 లక్షలు!


ఇప్పుడు ముఖ్యమైన తేదీల గురించి చెప్పాలంటే, దరఖాస్తులు 27 ఫిబ్రవరి 2026 మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 28 మార్చి 2026 రాత్రి 11:59 వరకు ఉంటుంది. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు ఆగకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

మీరు దరఖాస్తు చేసుకోవడానికి లింక్ కావాలంటే దరఖాస్తు వివరాలలో ఇస్తాను. అక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.

Railway Apprentice Jobs 2026 | 2801 Vacancies | 10th & ITI Candidates Apply

స్నేహితులారా, ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా మీ స్నేహితులతో కూడా పంచుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఉద్యోగ అప్డేట్ల కోసం మా ఛానల్‌ను సపోర్ట్ చేయండి.

APPLY LINK BELOW

dsssbonline.nic.in

OFFICIAL WEBSITE

https://dsssb.delhi.gov.in/recruitment

Leave a Comment