PGCIL Apprentice Recruitment 2026 | 188 Jobs | ITI Diploma Degree

PGCIL Apprentice Recruitment 2026 Details

PGCIL Apprentice Recruitment 2026 notification has been released for 188 apprentice vacancies.

హాయ్ ఫ్రెండ్స్… ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. ఈరోజు మీకోసం ఇంకో మంచి జాబ్ అప్డేట్ తీసుకువచ్చాను. ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లకి ఇది బాగా ఉపయోగపడే అవకాశం.

మిత్రులారా, న్యూదిల్లీలో ఉన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. దేశం అంతటా ఉన్న పీజీసీఐఎల్ కేంద్రాలు, ప్రాజెక్టులు, రీజియన్లలో కలిపి మొత్తం 188 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లకి మంచి ఛాన్స్. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

ఈ పోస్టులు వివిధ రీజియన్లలో ఉన్నాయి. నార్తెర్న్ రీజియన్-I లో హరియాణా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాలు ఉన్నాయి. అలాగే వెస్ట్రన్ రీజియన్-I లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. వెస్ట్రన్ రీజియన్-II లో మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రాంతాలు వస్తాయి. అలాగే సదరన్ రీజియన్-II లో కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలు ఉన్నాయి.

ఈ ప్రాంతాల్లో ఉన్న పీజీసీఐఎల్ ప్రాజెక్టులు, కార్యాలయాల్లో ఈ అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. మొత్తం 188 అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, సీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, రాజ్భాష అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి.

ట్రేడుల విషయానికి వస్తే, ప్రధానంగా ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రికల్, సివిల్ వంటి విభాగాల్లో ఈ అవకాశాలు ఉన్నాయి. అర్హత విషయానికి వస్తే, పోస్టుని బట్టి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్, ఎంబీఏ, బీఏ వంటి కోర్సులు పూర్తి చేసి ఉండాలి. అప్రెంటిస్ ట్రైనింగ్ కాలం ఒక సంవత్సరం ఉంటుంది.

ఈ కాలంలో అభ్యర్థులకు నెలనెలా స్టైపెండ్ కూడా ఇస్తారు. స్టైపెండ్ విషయానికి వస్తే, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ కు నెలకి సుమారు రూ.13,500, డిప్లొమా అప్రెంటిస్ కు రూ.15,000, అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, సీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, రాజ్భాష అసిస్టెంట్ పోస్టులకు నెలకి రూ.17,500 వరకు స్టైపెండ్ ఇస్తారు.

ఎంపిక ప్రక్రియ చాలా సింపుల్‌గా ఉంటుంది. అభ్యర్థులను వారి విద్యార్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తి చేస్తే సెలక్షన్ అవుతారు.

మరో మంచి విషయం ఏమిటంటే, ఈ పోస్టులకు దరఖాస్తు రుసుము అసలు లేదు. ఎవరికైనా ఫ్రీగా అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ముఖ్యమైన తేదీలు చూసుకుంటే, ఆన్లైన్ దరఖాస్తులు 2026 మార్చి 2 నుంచి ప్రారంభమయ్యాయి. అప్లై చేయడానికి చివరి తేదీ 2026 మార్చి 11. కాబట్టి అర్హత ఉన్న వాళ్లు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకుంటే మంచిది.

లింకు కావాలంటే దిగువ వివరాలు చూడండి. వెళ్లి అప్లై చేయొచ్చు. ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్లకి ఇది మంచి అవకాశం. మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ లో ఎవరికైనా ఐటీఐ, డిప్లొమా లేదా ఇంజినీరింగ్ పూర్తి అయి ఉంటే ఈ సమాచారాన్ని వాళ్లకి తప్పకుండా షేర్ చేయండి. ఇలా మంచి జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్.
All The best👍

apply link below

https://www.powergrid.in/en

application download pdf

Latest Govt Jobs 2026 | PGCIL 188 Apprentice Vacancies | Salary ₹17,500

Hello friends!

Railway Jobs for 10th/ITI/Diploma/Degree

How are you all doing today?

I hope everyone is doing well.

I am back with another job update for you.

This is a chance for those looking for a government apprenticeship in a well-known organization.

The Power Grid Corporation of India Limited or PGCIL in New Delhi has a job posting for 188 Apprentice positions across different regions in India.

They are accepting applications from qualified candidates for ITI, Diploma and Graduate Apprentice roles in various departments.

These apprentice jobs are available in parts of the country.

Here are the regions they are recruiting in:

  • Northern Region-I: Haryana, Uttar Pradesh and Rajasthan.
  • Western Region-I: Maharashtra, Chhattisgarh and Madhya Pradesh.
  • Western Region-II: Madhya Pradesh and Gujarat.
  • Southern Region-II: Karnataka and Tamil Nadu.

The selected candidates will work at PGCIL offices, projects or regional centers in these areas.

There are 188 apprentice vacancies in total.

The available categories are:

  • ITI Trade Apprentice
  • Diploma Apprentice
  • Graduate Apprentice
  • HR Executive Apprentice
  • CSR Executive Apprentice
  • Rajbhasha Assistant Apprentice

The main trades and departments are Electrician, Electrical and Civil.

To be eligible candidates must have completed the required qualification for the post.

Applicants should have:

  • ITI
  • Diploma
  • BE
  • B.Tech
  • B.Sc (Engineering)
  • MBA
  • BA

from a recognized institution or university.

The apprenticeship training period will be one year.

Railway Apprentice Jobs 2026 | 2801 Vacancies | 10th & ITI Candidates Apply

During this time selected candidates will get a stipend.

The stipend will be as follows:

  • ITI Trade Apprentices: around ₹13,500 per month.
  • Diploma Apprentices: around ₹15,000 per month.
  • Graduate Apprentices, HR Executive, CSR Executive and Rajbhasha Assistant Apprentices: around ₹17,500 per month.

The selection process will be simple.

Candidates will be shortlisted based on their educational qualification marks.

Then shortlisted candidates will go through document verification and a medical examination.

The good news is that there is no application fee for these apprentice posts.

Candidates can apply online for free.

Here are the important dates to remember:

  • Online application start date: 02 March 2026
  • Last date to apply online: 11 March 2026

If you or your friends have completed ITI, Diploma or Engineering this is an opportunity to gain experience with a government company, like PGCIL.

Apply before the date through the official online application process.

Share this information with your friends who are searching for jobs.

More job updates will be coming soon.

👍

apply link below

https://www.powergrid.in/en

Leave a Comment