ఆపరేటర్ పోస్టులు
హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను అవి ఏంటంటే
CSC: ఆధార్ సేవలు పెంచేదానికి 252 ఆపరేటర్ పోస్టులు – మార్చి 10 లోపే అప్లై చేసుకోండి
మిత్రులారా … మన దేశం మొత్తం జనాలకి ఆధార్ సేవలు సులభంగా అందాలన్న ఉద్దేశంతో సీఎస్సీ (CSC) ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ వాళ్లు పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసారోయ్. జిల్లాల్లొ ఖాళీగా ఉన్న ఆధార్ సూపర్ వైజర్, ఆపరేటర్ పోస్టుల్ని నింపేదానికి మొత్తం 252 పోస్టులు అందుబాటులో ఉన్నాయి . ఈ ఛాన్స్ మంచిదే కదా … కంప్యూటర్ పని తెలిసిన వాళ్లు తప్పక ట్రై చేయాలి.
ఈ ఉద్యోగాలు అంటే ఏంటంటే… ఆధార్ నమోదు, అప్డేట్, బయోమెట్రిక్ పని, డేటా ఎంట్రీ ఇలా జనాలకి అవసరమైన సేవలు అందించాల్సి ఉంటుంది. మన ఊర్ల దగ్గర్లోనే సెంటర్ల్లో పని చేసే అవకాశముండొచ్చు కాబట్టి, బయటకు వెళ్లాల్సిన ఇబ్బంది కూడా తక్కువగానే ఉంటుంది . కొంచెం కష్టపడి నేర్చుకున్న వాళ్లకి ఇది మంచి సెటిల్ అయ్యే పని అవుతుంది.
ముఖ్య సమాచారం చెప్పాలంటే:
ఈ నియామకాలు నిర్వహించేది సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ సంస్థ. పోస్టులు మొత్తం 252. అందులో ఆధార్ సూపర్ వైజర్, ఆపరేటర్ పోస్టులు ఉంటాయ్. దరఖాస్తు మాత్రం ఆన్లైన్ ద్వారానే చేయాలసి ఉంటుంది. ఆఫీసుకి వెళ్లి పేపర్లు ఇవ్వడం లాంటివి ఏమీ ఉండవు.
చివరి తేదీ మాత్రం మర్చిపోవద్దు — 2026 మార్చి 10. ఆ తేదీ లోపల అప్లై చేసేయాలి. లేట్ అయితే మళ్లీ అవకాశం ఉండకపోవచ్చు. అందుకే ఆసక్తి ఉన్న వాళ్లు ముందుగానే డాక్యుమెంట్లు రెడీ పెట్టుకుని అప్లై చేయడం మంచిది.
మన రాయలసీమ వాళ్లకి ఉద్యోగాలు దొరకడం కొంచెం కష్టమనే మాట నిజమే గానీ… ఇలాంటి అవకాశాలు వస్తే పట్టుకోాలి. కంప్యూటర్ మీద పని చేయగలిగితే, కొంచెం ట్రైనింగ్ తీసుకున్నా సరే ఈ జాబ్ చేసేయొచ్చు. గ్రామాల్లో, మండలాల్లో కూడా ఆధార్ సేవలకి డిమాండ్ బాగానే ఉంటుంది కాబట్టి పని స్టేబుల్గా ఉండే ఛాన్స్ ఎక్కువ.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే… ప్రభుత్వ సేవలతో సంబంధం ఉన్న పని కాబట్టి గౌరవం కూడా ఉంటుంది. జనాలు మన దగ్గరికి వచ్చి పని చేయించుకుంటారు. క్రమంగా అనుభవం పెరిగితే ఇంకా మంచి అవకాశాలు కూడా రావొచ్చు.
అందుకే చెప్పేదేమిటంటే… ఖాళీగా ఉన్న వాళ్లు, ఉద్యోగం కోసం తిరుగుతున్న వాళ్లు, కంప్యూటర్ తెలిసిన యువకులు ఈ అవకాశాన్ని వదలకండి. వెంటనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి వివరాలు చూసి అప్లై చేసేయండి. మన దగ్గర్లోనే పని చేసే అవకాశం రావచ్చు… అదీ పెద్ద ప్లస్ అయ్యేది.
మొత్తానికి చెప్పాలంటే — ఆధార్ సేవల విస్తరణలో భాగంగా వచ్చిన మంచి ఉద్యోగ అవకాశం ఇదోయ్. మార్చి 10 లోపే అప్లై చేసుకోండి… ఆలస్యం చేయకండి!
మీరు అప్లై చేయాలనుకుంటే లింకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను వెళ్లి అప్లై చేయండి
CSC Recruitment 2026: 252 Aadhaar Operator Jobs – Apply Now
Hi friends, how are you? Are you all doing well? I sincerely pray to God that you all stay happy and healthy. Today I came with another latest update for you. Here is the news
CSC: 252 Aadhaar Operator Jobs – Apply Before March 10
Friends, to make Aadhaar services easily available to people across India, CSC (Common Service Centre) e-Governance Services India Limited has released a big job notification. There are 252 vacancies for Aadhaar Supervisor and Operator posts in different districts. This is a good opportunity, especially for those who have basic computer knowledge.
These jobs mainly include Aadhaar enrollment, updates, biometric work, and data entry services for the public. There is a chance you may get work near your local area or district center, so you may not need to travel far. For people who are ready to learn and work sincerely, this can become a stable job.
Important Information:
The recruitment is conducted by CSC e-Governance Services India Limited. Total posts are 252, including Aadhaar Supervisor and Operator roles. The application process is online only. There is no need to submit papers physically at any office.
Last date to apply is March 10, 2026. Do not forget the deadline. If you are interested, prepare your documents and apply as soon as possible. Late applications may not be accepted.
This is a good chance for unemployed youth and those looking for a job. If you know computer basics, you can try for this opportunity. Aadhaar services have good demand in villages and towns, so there is a possibility of stable work. Since it is related to government services, the job also brings respect and experience. With time, you may get better opportunities too.
So friends, if you are searching for a job, don’t miss this chance. Visit the official website, check the details, and apply soon. You may get a job near your location, which is a big advantage.
If you want to apply, I will provide the link in the description below. Please check and apply.