ఇంటి నుంచే రైలు పార్సిల్ బుకింగ్!
హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు మరో లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఈ అప్డేట్ ఏంటంటే — సౌత్ ఇండియా, దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఒక కొత్త యాప్ను తీసుకొచ్చింది. ఆ యాప్ పేరు రైల్ పార్సిల్ యాప్.
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా వ్యాపారులు మరియు పార్సిల్ పంపే వారికి ఇది చాలా మంచి శుభవార్త. ఎవరైతే పార్సిల్ పంపాలనుకుంటారో వారికి ఇకపై క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ రైల్ పార్సిల్ యాప్ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పటివరకు మనం పార్సిల్ పంపాలంటే రైల్వే స్టేషన్లోని పార్సిల్ కార్యాలయానికి వెళ్లాలి, ఫారాలు నింపాలి, క్యూలో నిలబడాలి, బుకింగ్ కోసం సమయం ఖర్చు చేయాలి. ఈ మొత్తం ప్రక్రియ చాలామందికి కష్టంగా ఉండేది. టైమ్ కూడా చాలా వృథా అయ్యేది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు చేసే వారికి ఇది చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వ్యాపారులు, రైతులు, ఆన్లైన్ అమ్మకాలు చేసే వారు తరచూ పార్సిల్ సేవలను ఉపయోగించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలాంటి వారికి పరిష్కారంగా ఈ యాప్ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ యాప్ను అధికారికంగా ఆవిష్కరించారు. భారతీయ రైల్వేలో పూర్తిస్థాయి డిజిటల్ పార్సిల్ లాజిస్టిక్స్ సేవలను అందించే మొట్టమొదటి సమగ్ర అప్లికేషన్ ఇదేనని రైల్వే అధికారులు తెలిపారు.
ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఇంటి నుంచే పార్సిల్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. టాక్సీ లేదా ఫుడ్ డెలివరీ యాప్లను ఎలా సులభంగా ఉపయోగిస్తామో, అలాగే కొన్ని క్లిక్లతో పార్సిల్ కూడా బుక్ చేసుకోవచ్చు.
ఈ యాప్ ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే డోర్ టు డోర్ సేవ. అంటే పార్సిల్ పంపేవారి ఇంటి వద్ద నుంచే పికప్ చేసి, గమ్యస్థానంలో ఇంటి వద్దే డెలివరీ చేసే సదుపాయం ఉంటుంది. దీనివల్ల స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. అలాగే ఈ యాప్లో పార్సిల్ ట్రాకింగ్ సదుపాయం కూడా ఉంటుంది. పార్సిల్ ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఎప్పుడు చేరుతుంది? వంటి వివరాలను వినియోగదారులు రియల్ టైమ్లో తెలుసుకోవచ్చు. చెల్లింపులు కూడా ఆన్లైన్ ద్వారానే సురక్షితంగా చేయవచ్చు.
ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, బెంగళూరు నగరాల్లో ప్రారంభించారు. తర్వాత దశలవారీగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పార్సిల్ రవాణా అవసరాలు ఎక్కువగా ఉండటంతో ఈ నగరాలను మొదట ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, పార్సిల్ బుకింగ్ ఇక చాలా సులభంగా మారుతుందని తెలిపారు. డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా రైల్వే సేవలను ఆధునికీకరిస్తున్నామని, వినియోగదారుల సమయం ఆదా చేయడమే మా ప్రధాన లక్ష్యమని చెప్పారు.
మొత్తానికి ఈ రైల్ పార్సిల్ యాప్ ప్రారంభంతో రైల్వే పార్సిల్ సేవల్లో ఒక పెద్ద మార్పు రానుంది. భవిష్యత్తులో చిన్న వ్యాపారులు, ఈ-కామర్స్ విక్రేతలు, వ్యక్తిగతంగా పార్సిల్ పంపేవారు అందరూ ఈ సౌకర్యాన్ని సులభంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సమయం ఆదా అవుతుంది, పారదర్శక సేవలు లభిస్తాయి, డోర్ టు డోర్ డెలివరీ వంటి ప్రయోజనాలతో ఈ యాప్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
కాబట్టి ఇకనుంచి మీ దగ్గర మొబైల్ ఉంటే చాలు — ఇంట్లో నుంచే పార్సిల్ బుక్ చేసుకోవచ్చు. స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, ఇంకెందుకు ఆలస్యం? ఈరోజే రైల్ పార్సిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.లింకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను DOWNLOAD CHEYANDI
WEBSITE LINK BELOW