రైల్వే జోన్లలో మొత్తం 22,000 గ్రూప్-డి ఖాళీలను భర్తీ చేస్తోంది.
RAILWAY JOBS -22000 VACANCIES
hi friends Nenu me Benson ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అ దేవుని కోరుకుంటున్నాను
నిరుద్యోగంగా తిరుగుతున్న కుర్రాళ్లకీ, కుటుంబ భారం మోస్తున్న అబ్బాయిలకీ రైల్వే శాఖ నుంచి నిజంగా సంతోషపడే వార్త వచ్చింది . భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశం మొత్తం అన్ని రైల్వే జోన్లలో కలిపి సుమారు ఇరవై రెండు వేల గ్రూప్-డి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. లెవల్-1 పోస్టులకు సంబంధించి ఈ ప్రకటన విడుదల చేశారు.
మొదట జనవరి 21 నుంచే దరఖాస్తులు మొదలవుతాయని అనుకున్నారు గానీ, తాజా సమాచారం ప్రకారం జనవరి 31 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని ఆర్ఆర్బీ ప్రకటించింది. మార్చి 2 లేదా 3 వరకూ అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. టైం బాగానే ఉంది గానీ ఆలస్యం చేస్తే మాత్రం అవకాశం చేజారిపోతుంది. కాబట్టి అర్హత ఉన్నోళ్లు ముందే రెడీగా ఉండాలి.
మొత్తం 22,000 గ్రూప్-డి JOBS – RAILWAY JOBS -22000 VACANCIES
JOBS DETAILS
ఈ గ్రూప్-డి ఉద్యోగాల్లో పాయింట్స్మన్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ లాంటి పోస్టులు ఉంటాయి. ఇవన్నీ రైల్వేలో కీలకమైన పనులు. ట్రాక్ మెయింటెయినర్ అంటే రైలు పట్టాల సంరక్షణ, పాయింట్స్మన్ అంటే రైలు మార్గాలను మార్చే బాధ్యత, అసిస్టెంట్ పోస్టులు అంటే స్టేషన్ పనుల్లో సహాయం చేయడం లాంటి పనులు ఉంటాయి. పని కష్టమే అయినా ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి భద్రత ఉంటుంది.
QUALIFICATIONS
అర్హతల విషయానికి వస్తే పెద్దగా డిగ్రీలు, పీజీలు అవసరం లేదు రా. పదో తరగతి చదివి ఉండాలి. లేదా సంబంధిత ట్రేడులో ఐటీఐ చేసినోళ్లు అర్హులు. చదువు తక్కువైనా సరే, పని చేయగలిగే దమ్ము ఉండాలి. శారీరకంగా ఫిట్‌గా ఉండడం చాలా ముఖ్యం. ఫిజికల్ టెస్ట్ ఉంటుందికాబట్టి ముందే నడక, పరుగులు లాంటివి ప్రాక్టీస్ చేస్తే మంచిది.
వయస్సు 2026 జనవరి 1 నాటికి 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ఈ విషయంలో భయపడాల్సిన పని లేదు. రిజర్వేషన్ ఉన్నోళ్లు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
Understanding the Significance of RAILWAY JOBS -22000 VACANCIES
ఎంపిక ప్రక్రియలో ముందు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. అందులో అర్హత సాధిస్తే ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ పెడతారు. దానిలో పరుగెత్తడం, బరువు మోసే సామర్థ్యం లాంటి పరీక్షలు ఉంటాయి. అవి పాస్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ పరీక్ష చేస్తారు. ఇవన్నీ క్లియర్ చేస్తే జాబ్ ఖాయం.
SALARY
జీతం విషయానికి వస్తే మొదటి నుంచే నెలకి పద్దెనిమిది వేల రూపాయల జీతం వస్తుంది. రైల్వే జాబ్ కాబట్టి భవిష్యత్తులో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉంటాయి. కుటుంబానికి గౌరవం, సమాజంలో విలువ వస్తుంది.
ఈ నియామకాలు అహ్మదాబాద్, అజ్మేర్, బెంగుళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పూర్, కోల్‌కతా, మాల్డా, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్ లాంటి అన్ని రైల్వే రీజియన్లలో జరుగుతాయి. అంటే మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకీ మంచి ఛాన్స్ ఉంది.
చివరిగా చెప్పేదేంటంటే ఇలాంటి అవకాశం ప్రతి సారి రాదు రా. టైం చూసి భయపడి వదిలేస్తే తర్వాత బాధపడాల్సిందే.
APPLYING DATE
అర్హత ఉన్నోళ్లు అందరూ జనవరి 31 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ముందే సిలబస్ చూసి చదువు మొదలెట్టండి. కాస్త కష్టపడితే జీవితమే మారిపోతుంది
క్రింద dicrpistion lo లింక్ ఇచ్చాను వెళ్లి apply చేయండి అల్ ది best friends.
APPLY LINK BELOW
https://www.rrbsiliguri.gov.in/english/index.html
https://pratibhaassets.eenadu.net/uploadimages/rrbgrpd2620-1-2026.pdf