POST OFFICE JOBS (GDS)

POST OFFICE JOBS (GDS) – పోస్టు ఆఫీస్ లో 28,740 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీ benson ఫ్రెండ్స్ ఈరోజు మరొక లేటస్ట్ అప్డెట్ తో నేను మీ ముందుకు వచ్చాను ఈసారి పోస్ట్ ఆఫీస్ నుంచి మంచి జాబ్స్ వచ్చాయి. అవి ఏకంగా 28740 పోస్టులు ఖాళీగా ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ నుంచి గ్రామీణ డాక్ సేవక్ (GDS). రాయలసీమ వాళ్లకు ఇది మంచి గోల్డెన్ ఛాన్స్ అనుకోవాలి. దేశం మొత్తం మీద ఉన్న వివిధ పోస్టల్ సర్కిల్లో ఈ ఖాళీలు భర్తీ చేయటానికి షెడ్యూల్ వన్ జనవరి 2026 నోటిఫికేషను పోస్ట్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేశారు. పెద్ద చదువులు ఉండాల్సిన పనిలేదు రాత పరీక్షలు కూడా ఏమీ లేవు సింపుల్ గా పదవ తరగతి మంచి మార్కులతో పాస్ అయి ఉంటే చాలు ఆ మార్కులే ఆధారం. ముఖ్యంగా ఈ పోస్టు ఆఫీస్ ఉద్యోగాలు (GDS) లో చేరడానికి ఇది మంచి అవకాశం.

చదివినోడికి ఇది మంచి అవకాశం రా బాబు ఏ పోస్ట్ లు ఉన్నాయి అంటే ఈ జాబ్స్ అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటాయి కాబట్టి గుర్తుంచుకోండి

ఈ పోస్టు ఆఫీస్ ఉద్యోగాలు (GDS) కోసం అన్ని అభ్యర్థులు అప్లై చేసుకోవాలని మరియు పరిస్థితులు పూర్తి చేయాలని సూచించబడుతుంది.

బ్రాంచ్ పోస్ట్ మేనేజర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, జిడిఎస్ మొత్తం కలిపి 28740 పోస్టులు ఊర్లలో ఉండి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ఉద్యోగం చేయ్యాలనుకునే వాళ్లకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి. ఇక అర్హతలు ఎలా ఉంటాయి అని గమనించినట్లయితే సింపుల్ పదో తరగతి పాస్ అయి ఉండాలి అందులో మ్యాథ్స్ ఇంగ్లీష్ స్థానిక భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి. మన ఏపీ తెలంగాణ వాళ్లకైతే పదో తరగతి వరకు తెలుగు చదివి ఉండాల్సిందే అంతే కాకుండా కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. తరువాత సైకిల్ తొక్కడం కూడా రావాలి ఎందుకంటే పోస్ట్ మెన్ ఉద్యోగానికి ఇవి చాలా అవసరం కదా అందుకే ఈ అర్హతలు తీసుకొచ్చారు.

వయస్సు పరిమితి

252 Aadhaar Operator Jobs

18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి రిజర్వేషన్ వాళ్ళకైతే కొన్ని సడలింపులు ఉంటాయి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వాళ్లకు అయితే ఐదేళ్లు ఓబీసీ వాళ్లకు అయితే మూడేళ్లు దివ్యాంగులకైతే పదేళ్లు వయోపరిమితి ఉంటది. జీతం ఎంత ఇస్తారంటే ఇది పోస్ట్ ని బట్టి ఉంటది. బిపిఎం పోస్టుకు నెలకు సుమారు 12000 నుంచి 29380 రూపాయల వరకు ఇస్తారు అలాగే ఏబీపీఎం అంటే డాగ్ సేవ పోస్టులకు అయితే 10,000 నుంచి 24470 వరకు ఉంటది గ్రామాల్లో ఉండి ఈ జీతం అంటే చాలా గట్టిగానే ఉంటుందిరా.

ఎంపిక విధానం ఎట్లా ఉంటుందో చెప్తాను

Exploring POST OFFICE JOBS (GDS) Opportunities

ఇక్కడే అసలు హైలెట్ ఎలాంటి పరీక్ష లేదు మీరు పదవ తరగతిలో తెచ్చుకున్న మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు ఆ మెరిట్ లిస్టులో ఎవరైతే ముందు ఉంటారో వారి సెలెక్ట్ అయినట్లే వాళ్ళు ఎస్ఎంఎస్ ద్వారా ఈమెయిల్ ద్వారా లేకుంటే పోస్ట్ ద్వారా సమాచారం ఇస్తారు ఇక ఫీజు విషయానికొస్తే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, ట్రాన్స్ ఉమెన్ లు వాళ్ళకి ఫీజు లేదు మిగతా వాళ్ళందరూ కూడా ₹100 మాత్రమే దరఖాస్తు. ఎలా చేయాలంటే ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి గుర్తుపెట్టుకోండి.

IMPORTANT NOTE: ఒక అభ్యర్థి ఒక పోస్టల్ సర్కిల్ కి అప్లై చేయాలి. ఒకటి కంటే ఎక్కువ సర్కిల్కు అప్లై చేస్తే అన్ని దరఖాస్తులు కూడా రద్దు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటది కాబట్టి జాగ్రత్త.

 ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు అయితే 31-01- 2026 నుంచి 14-02-2026 వరకు ఉంటది.

ఇంకా ఫీజు ఎప్పుడు చెల్లించాలి అంటే ఫిబ్రవరి 02-02-2026 నుంచి 16-02-2026 వరకు దరఖాస్తు సవరణలు 18-02-2026 19-02-2026 వరకు ఉంటది ఇంతే ఫ్రెండ్స్ పదో తరగతిలో ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు. ముఖ్యంగా రాయలసీమలో ఉండే మన రాయలసీమలో ఉండే వాళ్ళకి ఇది మంచి అవకాశం సో వదులుకోకండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ జాబ్స్ కోసం నన్ను ఫాలో అవుతూ ఉండండి నేను మీ బెన్సన్ లింక్ కావాలంటే క్రింద dicrpistion లో ఇస్తాను వెళ్లి అప్లై చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఆల్ ది best బెస్ట్.

AIIMS Nursing Officer Recruitment 2026 – 2,551 Posts | Apply Now

APPLY BELOW LINK

https://indiapost.gov.in/gdsonlineengagement

DOWNLOAD PDF

Leave a Comment